ఆర్టీసీ పై ప్రభుత్వ నివేదిక అస్పష్టం, మళ్ళీ ఇవ్వండి:హైకోర్టు

ఆర్టీసీ పై ప్రభుత్వ నివేదిక అస్పష్టం, మళ్ళీ ఇవ్వండి:హైకోర్టు

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అస్పష్టంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నెల పదిహేను లోగా మరో నివేదిక ఇవ్వాలని ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. సమ్మెకు సంబందించి వచ్చిన ఒక పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. తాము చట్టబద్దంగా సమ్మెలోకి వెళ్లామని కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలియచేశాయి. అలాగే కార్మిక సంఘాలు తమ అభిప్రాయాలు తెలియచేయాలని హైకోర్టు కోరింది.ఈ కేసు విచారణను ఈ నెల పదిహేను వరకు వాయిదా వేసింది. కాగా ఆర్టీసీ సమ్మె వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ తెలిపారు. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం తెలిపింది. అయితే పలు చోట్ల చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని, బస్సు సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని ,సరైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.

more updates »