నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తేమ గాలులు వీస్తున్నాయని, వీటికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో, పిడుగులతో కూడిన వడగళ్ల వానలు కురిసే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మైదాన ప్రాంతాల్లో ఈ వర్షాలు అధికంగా కురుస్తాయని అన్నారు. కాగా, ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను చిరు జల్లులు పలకరించగా, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కర్నూలు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.

more updates »