రామజన్మభూమి - బాబ్రీ మసీదు పై తుది తీర్పు:లైవ్

రామజన్మభూమి - బాబ్రీ మసీదు పై తుది తీర్పు:లైవ్

సుప్రీంకోర్టు తీర్పులోని ఐదు ముఖ్యాంశాలు...

ఈ 2.77 ఎకరాల స్థలాన్ని భాగాలుగా పంచడం కుదరదు. ఇదంతా ఒకే భూభాగం. ఇది రామ్ లల్లాకు చెందుతుంది. ఈ స్థలంలో రామమందిర నిర్మాణం చేపట్టాలి. తీర్పు అమలుకు ప్రభుత్వం మూడు నెలల్లో ఒక ప్రణాళికను రూపొందించాలి.

బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మించింది కాదు. మసీదు నిర్మాణానికి ముందు అక్కడున్న నిర్మాణాన్ని కూల్చివేశారా, లేదా అన్నది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) స్పష్టం చేయలేదు. బాబ్రీ మసీదు కట్టడానికి ముందు అక్కడున్న నిర్మాణం ఇస్లామిక్ నిర్మాణం కాదని అక్కడి శిథిలాలకు సంబంధించి ఏఎస్‌ఐ ఇచ్చిన నివేదికలోని ఆధారాలు చెబుతున్నాయి. ఈ స్థలంలో 1528 నుంచి 1856 మధ్య నమాజు జరిగినట్లు ఆధారాలు లేవు.

అన్ని ఆధారాలను పరిశీలించి, ఈ భూమిని రాముడి ఆలయ నిర్మాణం కోసం హిందువులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అయోధ్యలోనే ఒక ప్రధాన ప్రాంతంలో ఐదెకరాల స్థలం కేటాయించాలి.

ఈ స్థల నిర్వహణ, ఆలయ నిర్మాణ బాధ్యతలు చూడటానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ఈ 2.77 ఎకరాల భూమిని ఈ ట్రస్టుకే అప్పగిస్తాం.

బాబ్రీ మసీదు కూల్చివేత (1992) చట్టబద్ధ పాలనను ఉల్లంఘించడమే.

అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి: కాంగ్రెస్

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాలని కాంగ్రెస్ భావించింది. కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా భారత జాతీయ కాంగ్రెస్ శ్రీరాముడి ఆలయ నిర్మాణం వైపే నిలుస్తుందని చెప్పింది.

‘ఇది చారిత్రక తీర్పు. ఈ తీర్పుతో భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది’- హిందూ మహాసభ లాయర్‌ వరుణ్‌ కుమార్‌ సిన్హా

వివాదాస్పద స్థలం హిందువులదే

అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు

చారిత్రక అయోధ్య కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగీవ్రంగా తీర్పును వెల్లడించింది. సీజేఐ గొగొయ్‌ అయోధ్యపై తీర్పును చదివి వినిపించారు. ‘‘మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి. ఇందుకోసం సున్నీ వక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలి. కేంద్రం లేదా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఇందుకు చర్యలు తీసుకోవాలి’’ అని రంజన్‌గొగొయ్‌ తెలిపారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎస్‌.ఏ.బోడ్బే, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి ప్రభుత్వ భూమి అని తేల్చిచెప్పింది. వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్‌ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నామని ధర్మాసనం వెల్లడించింది. బాబ్రీ మసీదును ఖాళీ స్థలంలో కట్టలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పురావస్తు శాఖల నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని న్యాయ స్థానం పేర్కొంది. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోందని న్యాస్థానం పేర్కొంది. మందిరాన్ని కూలగొట్టి మసీదును నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం వివరించింది.

సున్నీవక్ఫ్ బోర్డు న్యాయవాది అసంతృప్తి

సుప్రీం తీర్పుపై సున్నీవక్ఫ్ బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ అసంతృప్తి వ్యక్తంచేశారు. తీర్పు ప్రతి పూర్తిగా చదివాక భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు.

ప్రజలందరుకూడా సంయమనం పాటించి.. శాంతి భద్రతలకు సహకరించాలి: ఏపీ సీఎం జగన్

అయోధ్యలో వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు తరువాత ‘‘ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను’’ అంటూ ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారు ‘‘అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను.’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు

స్థల నిర్వహణ, ఆలయ నిర్మాణ బాధ్యతలు చూడడానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలి

కేంద్రం నేతృత్వంలో మూడు నాలుగు నెలల్లో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, ఆ ట్రస్టుకు స్థలాన్ని అప్పగించాలి. అక్కడ రామమందిర నిర్మాణం చేపట్టాలి. అలాగే సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల స్థలం ఇచ్చేలా చూడాలని కోర్టు తెలిపింది.

అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకే.. ముస్లింలకు మరో చోట స్థలం కేటాయింపు

అయోధ్యలో వివాదాస్పద ‘రామజన్మభూమి-బాబ్రీమసీదు’ స్థలం హిందువులకే కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదెకరాల స్థలాన్ని వేరే చోట కేటాయింపు

జంట నగరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు

రామజన్మభూమి - బాబ్రీ మసీదు వ్యాజ్యంపై తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో సున్నితమైన ప్రాంతాలలో ప్రత్యేక బలగాలను మోహరించామని, సోషల్ మీడియాలో అవాంఛిత వ్యాఖ్యలపై ఒక కన్నేసి ఉంచామని చెప్పారు.

ముంబయి, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో 144 సెక్షన్

అయోధ్య తీర్పు నేపథ్యంలో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఆదివారం 11 గంటల వరకు 144 సెక్షన్ విధించారు. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో నవంబరు 19 వరకు సెక్షన్ 144 విధించారు.

1528 నుంచి 1856 మధ్య అయోధ్యలోని వివాదస్పద స్థలంలో నమాజు జరగలేదు

‘‘వివాదాస్పద స్థలంలో 1528 నుంచి 1856 మధ్య ఎలాంటి నమాజు జరిగినట్లు ఆధారాలు లేవు. చరిత్రలో యాత్రికులు చెప్పిన వాదనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులు అయోధ్యను రామజన్మభూమిగా భావిస్తారు, అది వారి నమ్మకం. ముస్లింలు దాన్ని బాబ్రీ మసీదు అంటారు. అయితే, ఇక్కడ రాముడు జన్మించాడని హిందువులు నమ్ముతున్నారనడంలో ఎలాంటి వివాదం లేదు’’

రామజన్మభూమి అయోధ్య కేసు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. దీంతో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతా టెన్షన్..టెన్షన్ గా ఉంది. దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న ఈ కేసు నేటితో తేలిపోనుంది. దీంతో దేశమంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో దేశంలోని అన్ని దేవాలయాల్లోను భద్రతను కట్టుదిట్టం చేశారు.

అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి - బాబ్రీ మసీదు వ్యాజ్యంపై తుది తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 10.30కి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరిస్తుంది. ఈ క్రమంలో దేశం అంతా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పువైపు దృష్టి సారించింది. తీర్పు అనంతరం ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయో అనే ఉత్కంఠ నెలకొంది.

అయోధ్యపై సుప్రీంకోర్ట్‌ తుది తీర్పు

 • ఉదయం 10.30కు వెల్లడించనున్న ధర్మాసనం
 • ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి భద్రత పెంచిన ప్రభుత్వం
 • జస్టిస్ రంజన్ గొగొయ్‌కు జెడ్ కేటగిరీ భద్రత
 • అయోధ్యలో స్థల వివాదంపై నాలుగు సివిల్‌ దావాలు
 • వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 2.77 ఎకరాల భూమి
 • 2010లో అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు
 • ముగ్గురు కక్షిదారులు సమానంగా పంచుకోవాలని గతంలో తీర్పు
 • అలహాబాద్‌ హైకోర్ట్‌ తీర్పును సవాల్‌ చేస్తూ 14 పిటిషన్లు
 • అలహాబాద్‌ హైకోర్ట్‌ తీర్పుపై 2011 మేలో స్టే ఇచ్చిన సుప్రీంకోర్ట్‌
 • 2019 మార్చి 8న మధ్యవర్తిత్వ కమిటీ నియామకం
 • పరిష్కారం చూపలేక చేతులెత్తేసిన మధ్యవర్తుల కమిటీ
 • ఆగస్టు 6 నుంచి అక్టోబర్‌ 16 వరకూ సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ
 • 40 రోజులపాటు విచారణ జరిపిన ధర్మాసనం
more updates »