జిన్‌పింగ్‌ కి, భారత సంప్రదాయం ఉట్టిపడే కానుకలు ఇవ్వనున్న మోడీ!

జిన్‌పింగ్‌ కి, భారత సంప్రదాయం ఉట్టిపడే కానుకలు ఇవ్వనున్న మోడీ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య అధికారిక లాంఛనాలకు దూరంగా సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. పల్లవుల పట్టణం, మహాబలిపురం వేదికగా వీరి భేటీ జరుగుతోంది. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌కు ప్రధానిమోదీ మంచి కానుకలు సిద్ధం చేశారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడే విధంగా ఉండే మన దేశ కళాకృతులను జిన్‌పింగ్‌కు బహుమతిగా ఇవ్వనున్నారు.

ఆరు అడుగులు ఎత్తుండే దీపపు స్తంభాలు, మూడు అడుగుల ఎత్తుండే తంజావూరు పెయింటింగ్‌లను కానుకగా ఇస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. తమిళనాడు హస్తకళా నైపుణ్యాన్ని కళ్లకు కట్టేలా ఇవి ఉండనున్నాయి. బంగారం పూత పూసిన ఇత్తడి దీపపు స్తంభాలు రెండు కలిసి 108 కేజీల బరువు ఉంటాయి. వీటిని తయారు చేయడానికి 12 రోజులు పట్టిందట. సరస్వతి దేవి నృత్యం చేస్తున్న భంగిమలో గీసిన చిత్రలేఖనం మూడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి 45 రోజులు పట్టిందట. మరోవైపు ప్రధాని మోదీ కోసం జిన్‌పింగ్‌ ఎటువంటి కానుకను ఇవ్వనున్నారో వేచి చూద్దాం..? జింపింగ్ గారు.. "ఉగ్రవాదానికి కొమ్ము కాయకుండా ఉంటె చాలు అదే భారత్ కి మీరిచ్చే పెద్ద గిఫ్ట్" అని విశ్లేషకులు అంటున్నారు.

more updates »