టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ కోమటిరెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ కోమటిరెడ్డి
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. చేతకాని ప్రభుత్వం వల్ల 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. 23 మంది ఉసురు తగిలి కేసీఆర్‌ నాశనమైపోతారన్నారు. కేసీఆర్‌కు ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న ఆసక్తి పాలనపై లేదని ధ్వజమెత్తారు. ఇంటర్ ఫలితాలు సరిగా ప్రకటించలేని కేసీఆర్‌.. పీఎం అవుతారా? అంటూ ఎద్దేవాచేశారు. కమీషన్లు వచ్చే వాటిపైనే కేసీఆర్‌ సమీక్షలు చేస్తారని విమర్శించారు. చెరో రూ.50 లక్షలు తీసుకున్న అశోక్‌, విజేందర్‌రావులు.. గ్లోబరీనాకు టెండర్‌ ఇచ్చారని పేర్కొన్నారు. అసమర్ధుడు విద్యాశాఖ మంత్రి కావడం మన దురదృష్టమన్నారు. అడుక్కుతినే వాడు వేల కోట్లు సంపాదించాడని ఫైరయ్యారు.
more updates »