త్వరలో భారత్ పర్యటనకు వస్తా: ట్రంప్

త్వరలో భారత్ పర్యటనకు వస్తా: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధంలో శుక్రవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా-భారత్‌ మధ్య మెరుగైన సంబంధాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ భారత్‌-అమెరికా మధ్య అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయని, ప్రధాని మోదీ తనకు గొప్ప మిత్రుడని వ్యాఖ్యానించారు. తాను ఏదో ఓ సమయంలో భారత్‌కు వెళతానంటూ ట్రంప్ భారత పర్యటనపై తన అభిప్రాయాన్ని వెల్లడించడం విశేషం. హ్యూస్టన్‌లో 'హౌడీ-మోదీ' సభ సందర్భంగా ట్రంప్‌ని కుటుంబసమేతంగా భారత పర్యటనకు మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాగా ట్రంప్‌ పర్యటన ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు.

more updates »