ఆన్ స్క్రీన్ పులి..! ఆఫ్ స్క్రీన్ ..డ్యాష్..!

ఆన్ స్క్రీన్ పులి..! ఆఫ్ స్క్రీన్ ..డ్యాష్..!

మొదట నీతులు చెప్పాడు, తరవాత పరార్ అయ్యాడు, చివరికి అరెస్ట్ అయ్యాడు!

ఎంతోమంది రాజకీయ నేతలను ఇంటరాగేట్ చేసి మంచి జర్నలిస్టుగా పేరు గడించిన టీవీ9 రవి ప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆన్ స్క్రీన్ తన తెలివి తేటలతో పులిలా రెచ్చి పోయాడు, కానీ ఆఫ్ స్క్రీన్ మనీలాండరింగ్, ఫోర్జరీ పత్రాలతో టీవీ9 కి నష్టం తెచ్చే జిత్తులు మారి వ్యక్తిలా వ్యవహరించిన రవి ప్రకాష్ కథ ఇక కటకటాల వెనుకకే అనే ప్రచారం జోరుగా సాగుతుంది. మొదటేమో నీతులు చెప్పాడు. ఆ తర్వాత పరార్ అయ్యాడు! చివరికి దొరికిపోయాడు. ఏమి చేయలేక అరెస్ట్ అయ్యాడు.

రవి ప్రకాష్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ఆర్థిక నేరాల ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఒకడుగు ముందుకేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలని, తీవ్రమైన మనీలాండరింగ్ వ్యవహారాల్లో కూడా రవిప్రకాష్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఈ అభియోగాలపై సీబీఐ- ఈడీల విచారణ మొదలైతే రవిప్రకాష్ కథ కంచికే అని కూడా ప్రచారం జరుగుతూ ఉంది.

ఎవరు లేక ఒంటరై - అందరికి దూరమై!

ఈ సంగతి ఇలా ఉంటే.. ఇప్పుడు రవి ప్రకాష్ ను ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్నట్టుగా కూడా లేరు. మొన్నామధ్య అమిత్ షాతో ఫొటోను పోస్టు చేసి తన రేంజ్ ఏమిటో చూపించాలని రవి ప్రకాష్ ప్రయత్నించాడు. అయితే ఇప్పుడు జైల్లో ఈయనను ఏ బీజేపీ నేతా పరామర్శించడం లేదు. రేవంత్ రెడ్డి మాత్రం పరామర్శించి వచ్చారు. తన జర్నలిస్టిక్ తెలివితేటలను ఉపయోగించి రేవంత్ రెడ్డికి ప్రచారంలో సాయంచేశాడట రవి ప్రకాష్. అందుకే రేవంత్ వచ్చి పరామర్శించారు అని సమాచారం.

టీవీ9 సంస్థకు హాని కలిగించే ఉద్దేశంతో కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాక, కంపెనీ నిర్వహణలో యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరించిన రవి ప్రకాష్ ను సీఈవో పదవి నుండి తొలగించిన విషయం తెల్సిందే.

more updates »