టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదు

టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదు

టీవీ9 యాజమాన్యానికి సంబంధించి కొత్త వివాదం చోటు చేసుకుంది. ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి కొన్ని రోజుల క్రితం టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. అయితే, యాజమాన్యం బదిలీకి సంబంధించి కొంచెం వివాదం నడుస్తున్నట్టు సమాచారం. పాత యాజమాన్యం కొన్ని అడ్డంకులు కలిగిస్తోందని, తన సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారని, కొత్త డైరెక్టర్ల నియామకానికి అడ్డు తగులుతున్నారని అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. ప్రస్తుతం రవిప్రకాశ్ ఇంట్లో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ వ్యవహారంపై రవిప్రకాశ్ కానీ, పోలీసు అధికారుల ఇంతవరకు స్పందించలేదు.

more updates »