తెలుగు ముఖ్యమంత్రుల దసరా శుభాకాంక్షలు

 తెలుగు ముఖ్యమంత్రుల దసరా శుభాకాంక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు ఆంగ్లం లో దసరా శుభాకాంక్షలు తెలియజేసారు. దుష్ట శక్తులపై దుర్గా మాత సాధించిన విజయాన్ని ఉత్సవంగా జరుపుకొందాం. అందరికీ దసరా శుభాకాంక్షలు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినానా ప్రజలంతా సంతోషంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. దుష్ట శక్తులపై ఎప్పటికీ మంచిదే విజయమని కేసీఆర్ తెలిపారు. దేశ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు అందించడం కోసం జగన్‌తోపాటు తెలంగాణముఖ్యమంత్రి ఇంగ్లిష్ ట్వీట్ చేయడం గమనార్హం.

తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విజయాలను చేకూర్చే విజయ దశమి పర్వదినాన్ని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ... దసరా శుభాకాంక్షలు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

more updates »