చంద్రబాబుకి పార్టీ కార్యకర్త నుంచి ఊహించని బహుమతి

చంద్రబాబుకి పార్టీ కార్యకర్త నుంచి ఊహించని బహుమతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పార్టీ కార్యకర్త నుంచి ఊహించని బహుమతి లభించింది. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అహరహం కష్టపడుతున్నారని, ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని భావించిన ఓ కార్యకర్త అధినేతకు ఎవరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త రామానుజం చలపతి గడియారం, లంచ్ బాక్స్‌ను బహుమతిగా అందించారు. వేళకు భోజనం చేయాలనే ఈ రెండింటినీ బహుమతిగా ఇచ్చినట్టు చలపతి పేర్కొన్నాడు. తన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్న కార్యకర్త చలపతిని చంద్రబాబు అభినందించారు.

more updates »