ఏపీలో బీజేపీ చేష్టలతో ప్రజల కడుపు మండిపోతోంది: యామిని

ఏపీలో బీజేపీ చేష్టలతో ప్రజల కడుపు మండిపోతోంది: యామిని

ఏపీలో బీజేపీ చేష్టలతో ప్రజల కడుపు మండిపోతోందని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అందుకే, ఏపీలో బీజేపీ అగ్రనేతలు పర్యటించిన సమయంలో ప్రజలు నిరసన తెలపడం ద్వారా తగినబుద్ధి చెప్పారని అన్నారు.

బీజేపీ పరిపాలన లేని రాష్ట్రాల్లో తాము తలచుకుంటే ఆ ప్రభుత్వాలు ఉంటాయా? అంటూ ఆ పార్టీ నేత రఘురాం చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీల పట్ల బీజేపీ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. దేశంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, చివరకు సీఈసీపై ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టేలా బీజేపీ చేసిందని దుయ్యబట్టారు.

‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నట్లు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడే ఇలాంటి పనులు చేస్తారని, బీజేపీ వాళ్ల వినాశనాన్ని వాళ్లే కొనితెచ్చుకుంటున్నారని యామిని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

more updates »