చంద్రబాబుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన వైఎస్ జగన్

చంద్రబాబుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన వైఎస్ జగన్

ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఆ తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడి వైఖరి, ఆయన ఆదేశాల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. గురజాల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల రోజున జరిగిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లిన జగన్, పోలీసులు కూడా అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతూ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు నరసింహన్ కు వినతిపత్రాన్ని సమర్పించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.

more updates »