చెలరేగిన రోహిత్.. భారత్‌ ఘన విజయం

చెలరేగిన రోహిత్.. భారత్‌ ఘన విజయం

తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను ముగించగలనని హిట్‌మాన్ రోహిత్ శర్మ మళ్లీ నిరుపించాడు. తనకెంతో ముఖ్యమైన వందో టీ20 మ్యాచ్‌లో చితక్కొట్టాడు. రాజ్‌కోట్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బంగ్లా ఆటగాళ్లకు తన విశ్వ రూపం చూపించాడు. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 43 బంతుల్లో 85 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో 154 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే మ్యాచ్ ని ముగించారు.

more updates »