నోకియా 7.1, 6.1 ప్లస్ ఫోన్ల ధరలు తగ్గాయి!

నోకియా 7.1, 6.1 ప్లస్ ఫోన్ల ధరలు తగ్గాయి!

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 7.1, 6.1 ప్లస్ ఫోన్ల ధరలను ఇండియాలో భారీగా తగ్గించింది. నోకియా 7.1 ఫోన్ భారత్‌లో రూ.19,999 ధరకు విడుదల కాగా, ఏప్రిల్‌లో ఈ ఫోన్ ధర తగ్గి రూ.17,999 అయింది. అయితే ఇప్పుడు మళ్లీ ధరను తగ్గించడంతో ప్రస్తుతం ఈ ఫోన్‌ను వినియోగదారులు రూ.12,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఇక నోకియా 6.1 ప్లస్‌కు చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.15,999 ఉండగా అది రూ.4వేలు తగ్గి రూ.11,999 ధరకు లభిస్తున్నది. అలాగే ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధరను రూ.18,499 నుంచి రూ.14,999 ధరకు తగ్గించారు. ప్రస్తుతం తగ్గిన ధరలకే ఈ రెండు ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

కాగా నోకియా 7.1 ఫోన్‌లో 5.84 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 64 జీబీ స్టోరేజ్, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందజేస్తుండగా.. నోకియా 6.1 ప్లస్ ఫోన్‌లో 5.8 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 64 జీబీ స్టోరేజ్, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

more updates »