జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనున్న అనసూయ

జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనున్న అనసూయ

యాంకర్ గా వచ్చే క్రేజ్ వేరుగా ఉంటుంది. ఆ మాటకు వస్తే.. బుల్లితెర మీదక ఎంతమంది తెలుగు యాంకర్లు లేరు. కానీ.. అనసూయకు వచ్చిన క్రేజ్.. ఆమె మాటల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే విషయంలో అనసూయకు సాటి మరెవ్వరూ రారని చెప్పాలి. వారంలో రెండు రోజుల పాటు వచ్చే జబర్దస్త్ ప్రోగ్రాంకు యాంకరింగ్ చేసే (గడిచిన కొంత కాలంగా వారానికి ఒక్క ఎపిసోడ్ లోనే) అనసూయకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఆమె కోసమే ఈ కార్యక్రమాన్ని చూసేవాళ్లు ఉన్నారని చెబుతారు. అంతేకాదు.. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ తో ఆమెకు సినీ అవకాశాలు రావటం.. వాటిల్లో తన టాలెంట్ చూపించిన ఆమెకు ఇప్పుడు వరుస పెట్టి సినిమా అవకాశాలు వస్తున్నాయి. క్షణంలో ఆమె చేసిన పాత్ర ఒక ఎత్తు అయితే.. రంగస్థలంలో రంగమ్మత్తగా ఆమె చేసిన పాత్ర అనసూయ మీద ఉన్న ఇమేజ్ ను మొత్తంగా మార్చేసిందని చెప్పాలి.

ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో కథనం మూవీ వస్తోంది. ఈ మధ్యన ఆమెకు సినిమా అవకాశాలు పెరుగుతుండటంతో సినిమాలకు.. బజర్దస్త్ కు కాల్షీట్లు సర్దలేకపోతుందట. దీంతో.. బాగా థింక్ చేసిన మీదట జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాలని ఆమె డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఒకప్పుడు తన ఇమేజ్ పెంచుకోవటానికి జబర్దస్త్ సాయం తీసుకున్న అనసూయ.. ఇప్పుడు ఆ షోకు ఆమె ఒక ప్రత్యేక ఆకర్షణగా మారారని చెప్పక తప్పదు. మరి.. అనసూయ వెళ్లిపోతే జబర్దస్త్ కార్యక్రమం ఎలా ఉంటుందో చూడాలి.

more updates »