మణిరత్నంకు గుండెపోటు

మణిరత్నంకు గుండెపోటు

వెటరన్ డైరెక్టర్ మణిరత్నంకు ఆదివారం గుండెపోటు రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారని.. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. తాజాగా మరోసారి గుండెకు సంబంధించిన సమస్యలతో మరోసారి ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఈ వార్తలకు భిన్నంగా మణిరత్నంకు ఆదివారం నాడు ఛాతీలో నెప్పి రావడంతో రొటీన్ చెకప్ కోసం మాత్రమే లోకల్ హాస్పిటల్ కు వెళ్ళారని.. ఆందోళన చెందాల్సిన పనేమీ లేదన.. ఇది అసిడిటీకి సంబంధించిన సమస్యమాత్రమేనని టైమ్స్ గ్రూప్ రిపోర్ట్ చేసింది. మరోవైపు కోలీవుడ్ పీఆర్ వో.. మీడియా కన్సల్టెంట్ నిఖిల్ మురుగన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా "రొటీన్ చెకప్ తర్వాత మణిరత్నం సార్ ఈరోజు రొటీన్ వర్క్ పై ఆఫీస్ కు వచ్చారు. అల్ ఈజ్ వెల్" అంటూ ట్వీట్ చేశారు. అయితే మణి సార్ ఆరోగ్యం పరిస్థితిపై ఇంకా ఆయన కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది.

మణిరత్నం ప్రస్తుతం 'పొన్నియన్ సెల్వన్' ఒక భారీ హిస్టారికల్ చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. పలువురు స్టార్ హీరో హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సాగుతోంది.

more updates »