మిలిటరీ ఆఫీసర్ గా మహేష్

మిలిటరీ ఆఫీసర్ గా మహేష్

మహర్షి ఇచ్చిన బ్లాక్ బస్టర్ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే విదేశాలకు హాలిడే కోసం వెళ్లిన మహేష్ బాబు ప్రస్తుతం ఇండియా మ్యాచులు చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తిరిగి రాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరులో పాల్గొనాల్సి ఉంటుంది. హీరో లేకుండానే పూజా కార్యక్రమాలు చేసేసిన టీం ప్రస్తుతం ప్రిన్స్ కోసం వెయిటింగ్ లో ఉంది. ముందుగా కాశ్మీర్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కథ ప్రకారం మహేష్ ఇందులో మిలిటరీ ఆఫీసర్ గా కనిపిస్తాడు.

దానికి సంబంధించిన సన్నివేశాలు ముందుగా షూట్ చేస్తారు. తిరిగి హైదరాబాద్ వచ్చాక ఇక్కడి పార్ట్ మొదలవుతుంది. కొన్ని రోజులయ్యాక నేరుగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ కు యూనిట్ షిఫ్ట్ అయిపోతారు. ముఖ్య భాగం మొత్తం అక్కడే తీయాల్సి ఉంటుందని వినికిడి. సో రాగానే మహేష్ బిజీగా మారిపోతాడన్న మాట. ఈ ఏడాదిలో ఆరు నెలలు గడిచిపోయాయి. బాలన్స్ ఉన్న 180 రోజుల్లో పాటలతో సహా షూటింగ్ మొత్తం పూర్తి చేసి డిసెంబర్ కంతా ఫస్ట్ కాపీ చేయాలి.

అప్పుడే సంక్రాంతి రేస్ కు సరిలేరు సిద్ధమవుతుంది. దానికి తగ్గట్టే అనిల్ రావిపూడి పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. రష్మిక మందన్న హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో చాలా ఏళ్ళ తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ కంపోజ్ చేయడం త్వరలోనే ప్రారంభం కానుంది. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు మహేష్ రాగానే మెట్రో స్పీడ్ తో పరిగెత్తనుంది

more updates »