సూర్యకు కృతజ్ఞతలు తెలిపిన మోహన్ బాబు

సూర్యకు కృతజ్ఞతలు తెలిపిన మోహన్ బాబు

తమిళ హీరో సూర్య నటించిన 'ఎన్జీకే' ఈమధ్యే రిలీజ్ అయింది.. కానీ ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే సూర్య ఈ ఫలితంతో నిరాశచెందకుండా తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు. కెవీ ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న 'కాప్పాన్' షూటింగ్ పూర్తియింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో 'సూరారై పొట్రు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వెటరన్ తెలుగు యాక్టర్ మోహన్ బాబు ఒక కీలక పాత్రలో పోషిస్తున్నారు.

ఈమధ్యే మోహన్ బాబు ఈ సినిమా తాజా షెడ్యూల్ లో పాల్గొని సూర్యతో కలిసి నటించారు. ఈ సందర్భంగా సూర్య ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మోహన్ బాబు సర్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని.. ఆయన గొప్ప క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని.. 500 సినిమాలకు పైగా నటించిన ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అన్నారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు మోహన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ట్వీట్ కు స్పందించిన మోహన్ బాబు "సూర్య..మీరు నా గురించి చెప్పిన గొప్ప మాటలకు కృతజ్ఞతలు. ఈ జెనరేషన్ లో ఒక టాప్ స్టార్ అయినప్పటికీ.. మీ క్రమశిక్షణ.. సెట్స్ లో మీరు వినయంగా ప్రవర్తించే తీరు మీ ఉన్నతమైన వ్యక్తిత్వం గురించి చెప్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తుంటాను మై యంగ్ ఫ్రెండ్" అంటూ సూర్యపై ప్రశంసలు కురిపించారు. మోహన్ బాబు అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. అలాంటి సీనియర్ నటుడి నుండి క్రమశిక్షణ గల నటుడని సూర్య కితాబు అందుకున్నాడంటే అదేమీ సాధారణ విషయం కాదు. ఈయన కూడా కఠోరమైన క్రమశిక్షణ ఫాలో అయ్యే వ్యక్తే.. అనుమానం ఇల్లై!

more updates »