`సైరా` డిజైనర్ సుశ్మిత పై తమన్నా కామెంట్

`సైరా` డిజైనర్ సుశ్మిత పై తమన్నా కామెంట్
`సైరా` డిజైనర్ సుశ్మిత పై తమన్నా కామెంట్

24 శాఖల్లో కాస్ట్యూమ్ డిజైన్ అనే శాఖకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. సంజయ్ లీలా భన్సాలీ రేంజు కాన్వాసుతో తెరకెక్కుతున్న `సైరా` చిత్రానికి అదే తీరుగా కాస్ట్యూమ్స్ డిజైనింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుశ్మిత చాలానే ప్రయోగాలు చేస్తున్నారట. రాజులు- రాజ్యాలు పోయినా.. నాటి జ్ఞాపకాలు ప్రేక్షకుల్లో పదిలంగా ఉన్నాయి. అందుకే సైరా కాస్ట్యూమ్స్ డిజైనింగ్ ని సుశ్మిత ఎంతో ఛాలెంజింగ్ గా భావించారట. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అంజు మోడీతో కలిసి `సైరా` రకరకాల వెరైటీ కాస్ట్యూమ్స్ ను సుస్మిత డిజైన్ చేశారని తెలుస్తోంది. అందుకోసం భారీగా బడ్జెట్ ని వెచ్చించారట చరణ్.

అయితే సుశ్మిత కాస్ట్యూమ్స్ పనితనం ఇదివరకూ రివీల్ చేసిన పోస్టర్లు.. టీజర్ లో కనిపించిందని ప్రశంసలు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవి.. అమితాబ్.. సుధీప్ .. నయనతార వంటి వారి డ్రెస్ డిజైనింగ్ పై ప్రశంసలు కురిశాయి. అలాగే ఈ చిత్రంలో రాజనర్తకి పాత్ర అత్యంత కీలకమైనది. ఆ పాత్రలో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ పాత్ర పోషిస్తున్న తమన్నా కోసం సుస్మిత సుమారు 500 మంది డిజైనర్స్ సలహాలు తీసుకుని లెహంగాని డిజైన్ చేశారట. ఈ సినిమాలో చిరు- తమన్నా పై వచ్చే రొమాంటిక్ సాంగ్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.

ఈ టాప్ సీక్రెట్ ని `కామోషి` (తెలుగు-తమిళం) రిలీజ్ సందర్భంగా ప్రచార ఇంటర్వ్యూలో తమన్నా రివీల్ చేశారు. తమన్నా మాట్లాడుతూ-``నేను ఎందరో కాస్ట్యూమ్ డిజైనర్లతో పని చేశాను. కానీ సుశ్మిత డిజైనింగ్ స్టైల్ .. క్రియేటివిటీ.. డెడికేషన్ చాలా ప్రత్యేకంగా ఉంది. రాజనర్తకి పాత్ర కోసం అద్భుతమైన కాస్ట్యూమ్ ని డిజైన్ చేశారు`` అంటూ ప్రశంసలు కురిపించారు. సైరా 18వ శతాబ్దపు రోజులల్లోకి తీసుకెళుతుంది..బాహుబలి తరువాత కాస్ట్యూమ్స్ విషయంలో నిజమైన రాయల్ టచ్ ఉన్న చిత్రమిదని పొగిడేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుశ్మిత కాస్ట్యూమ్స్ ఫెంటాస్టిక్.. గొప్ప డెడికేషన్ ఉన్న డిజైనర్.. అని తమన్నా మెచ్చుకోవడం విశేషం. `సైరా` చిత్రానికి సంబంధించి కొణిదెల కాంపౌండ్ అనవసరమైన ప్రచారార్భాటం చేయడం లేదు. ఆ క్రమంలోనే సరైన బజ్ లేదంటూ ఓ సెక్షన్ మీడియా దుష్ప్రచారం సాగిస్తున్న వైనం బయటపడుతోంది. అయితే మొన్న సీనియర్ నటుడు తనికెళ్ల భరణి పాజిటివ్ వ్యాఖ్య చేయడంతో సైరా టీమ్ కి అది పెద్ద ప్లస్ అని చెప్పాలి. తాజాగా తమన్నా ఇచ్చిన క్లూ కూడా ఉత్కంఠ పెంచుతోంది. సైరా చిత్రాన్ని ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా తీర్చి దిద్దేందుకు చిరంజీవి-సురేందర్ రెడ్డి- రామ్ చరణ్ బృందం శ్రద్ధ తీసుకుంటోందని అర్థమవుతోంది.

more updates »