సాహో తర్వాత ప్రభాస్‌ చెయ్యబోయే సినిమా ఇదే

సాహో తర్వాత ప్రభాస్‌ చెయ్యబోయే సినిమా ఇదే

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ మరియు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్న సాహో మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమూవీ తరువాత ప్రభాస్ ఈ డైరెక్టుతో , ఏ నిర్మాతతో మూవీ చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు... నెక్స్ట్ మూవీ రాధకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాలో నటిస్తున్నాడు ప్రభాస్‌.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జాన్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. జాన్‌ తరువాత చేయబోయే సినిమాపై కూడా ప్రభాస్ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు ప్రభాస్‌ హీరోగా ఓ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.

తంలో ప్రభాష్ హీరోగా మున్నా, మిస్టర్‌ పర్ఫెక్ట్‌ లాంటి సినిమాలను తెరకెక్కించిన దిల్ రాజు హ్యాట్రిక్‌ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సాహో సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను కూడా దిల్ రాజు తీసుకున్నరాన్న ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌ కూడా దిల్ రాజుతో కలిసి వర్క్ చేస్తే సుముఖంగానే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

more updates »