బ్రాండ్ బాబు రివ్యూ

Article

బ్రాండ్ బాబు రివ్యూ : నటీనటులు : సుమంత్ శైలేంద్ర , ఈషా రెబ్బా , మురళీశర్మ సంగీతం : జేబీ నిర్మాత : శైలేంద్ర బాబు దర్శకత్వం : ప్రభాకర్ రేటింగ్ : 3.5/ 5 రిలీజ్ డేట్ : 3 ఆగస్టు 2018 దర్శకులు మారుతి కథ అందించిన చిత్రం ” బ్రాండ్ బాబు ” . ఈటీవి ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమంత్ శైలేంద్ర – ఈషా రెబ్బా జంటగా నటించారు . ఎంటర్ టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం రేపు విడుదల అవుతుండగా సినిమాపై నమ్మకంతో ఒకరోజు ముందుగానే షో వేశారు . ఇక ఈ బ్రాండ్ బాబు ఎలా ఉందో తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ : అలవాట్లు డీసెంట్ గా ఉండాలని , వస్తువులు బ్రాండెడ్ వే వాడాలని విచిత్ర అలవాట్లు ఉన్నవాడు రత్నం ( మురళీశర్మ ) , సామాన్య ప్రజలను అసలు మనుషులగానే గుర్తించని ఈ రత్నం కు డైమండ్ (సుమంత్ శైలేంద్ర ) అనే పుత్రరత్నం ఉంటాడు . ఇతడికి కూడా అన్ని అవే చెబుతూ ప్రతీది బ్రాండ్ అంటూ బ్రాండ్ బాబు ని చేస్తాడు . అయితే ఈ బ్రాండ్ బాబు హోమ్ మినిష్టర్ ఇంట్లో పనిచేసే రాధ ( ఈషా రెబ్బా ) ని చూసి హోమ్ మినిష్టర్ కూతురు అనుకొని ప్రేమిస్తాడు కానీ ఆమె ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి అని తెలుసుకొని దూరం అవుతాడు . బ్రాండ్ పిచ్చి పట్టుకున్న రత్నం కు అలాగే డైమండ్ కు అసలు రియాలిటీ ఏంటో తెలిసిందా ? రాదని డైమండ్ పెళ్లి చేసుకున్నాడా ? లేదా ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలైట్స్ : ఎంటర్ టైన్ మెంట్ మురళీశర్మ నటన సుమంత్ శైలేంద్ర ఈషా రెబ్బా ప్రభాకర్ డైరెక్షన్ డ్రా బ్యాక్స్ : నటీనటుల ప్రతిభ : ఈ సినిమాలో హైలెట్ మురళీశర్మ నటన , నెగెటివ్ షేడ్ లో రత్నం పాత్రలో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు . గతకొంత కాలంగా ఒకే తరహా పాత్రలను పోషిస్తున్న మురళీశర్మ కు మళ్ళీ చాలారోజుల తర్వాత లభించిన మంచి పాత్ర దాంతో అదరగొట్టాడు . ఇక హీరో సుమంత్ శైలేంద్ర విషయానికి వస్తే బ్రాండ్ బాబు క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోయాడు అని చెప్పడంలో సందేహం లేదు . నటనలో కూడా తనదైన ప్రత్యేకత నిరూపించుకున్నాడు . ఈషా రెబ్బా కు మంచి పాత్ర లభించింది దాంతో అందంగా ఉండటమే కాకుండా అంతకంటే అందంగా నటించి మెప్పించింది .

సాంకేతిక వర్గం : సాంకేతికంగా కూడా అందరి కృషి అభినందనీయం అయితే ఇందులో ముగ్గురి గురించి తప్పకుండా చెప్పాలి అంతేకాదు మొత్తం క్రెడిట్ కూడా ఆ ముగ్గురికే చెందుతుంది కూడా . ఇంతకీ ఎవరా ముగ్గరు అంటే కథ , స్క్రీన్ ప్లే అందించిన మారుతి , దర్శకత్వం వహించిన ప్రభాకర్ , ఖర్చుకి వెనుకాడకుండా బ్రాండ్ బాబు అనిపించేలా నిర్మించిన శైలేంద్ర బాబు లది . వినోదానికి అగ్ర తాంబూలం ఇస్తూ కథ ని కథనాన్ని వండిన మారుతి ప్రభాకర్ చేతిలో పెడితే మారుతి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేసిన వ్యక్తి ప్రభాకర్ . బుల్లితెర మెగాస్టార్ గా వెలుగొందుతున్న ప్రభాకర్ కు డైరెక్షన్ కొత్తేమి కాదు కాకపోతే బుల్లితెర మీద ఎన్నో ప్రయోగాలు చేసాడు ఇక వెండితెర మీద చేసిన మొదటి ప్రయత్నం బెడిసి కొట్టినప్పటికీ అతడి ప్రతిభ పై నమ్మకంతో బ్రాండ్ బాబు ని అతడి చేతిలో పెట్టగా తనకున్న అపారమైన అనుభవంతో మారుతి ఇచ్చిన కథనానికి తన టాలెంట్ ని జోడించి మరింతగా రక్తికట్టించాడు .

ఓవరాల్ గా : హాయిగా రెండున్నర గంటలు ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు మంచి ఛాయిస్ బ్రాండ్ బాబు

Prev గూఢచారి రివ్యూ
Next రీమేక్ క్వీన్ గా సమంత!!
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.