'ఆర్ఆర్ఆర్' మూవీ కోసం హీరోయిన్ వేట.. ఆ ఇద్దరు భామలపై కన్ను

Article
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో చరణ్ జోడీగా అలియా భట్ ను తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ సరసన 'డైసీ ఎడ్గర్ జోన్స్'ను ఎంపిక చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. రాజమౌళి మాత్రం శ్రద్ధా కపూర్ .. జాన్వీ కపూర్ లపై దృష్టి పెట్టినట్టుగా సమాచారం. 'సాహో'లో శ్రద్ధా కపూర్ పోర్షన్ దాదాపు పూర్తయిందట. అందువలన ఆమెను ఈ సినిమాలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా సమాచారం. ఏ కారణం చేతనైనా శ్రద్ధా కపూర్ నో చెబితే, జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే నిర్ణయంతో రాజమౌళి ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. మరి ఈ ఇద్దరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. అజయ్ దేవగణ్ కీలమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, 2020 జూలై 30న విడుదల చేయనున్నారు.
Prev జనసేన పార్టీకి సినీ హీరో నితిన్ భారీ విరాళం
Next బిగ్ బాస్ -3 హోస్ట్ గా నాగార్జున
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.