ఈ నెల 14న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ విడుదల చేస్తున్నా: వర్మ

Article

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ట్రైలర్ ను ఈ నెల 14వ తేదీ ఉదయం 9.27 గంటలకు విడుదల చేయనున్నట్టు ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం 'మహానాయకుడు' విడుదల కానున్న ఈ నెల 22వ తేదీ నాడే తమ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘మహానాయకుడు’ చిత్రం చూసేందుకు థియేటర్లకు ఎవరైతే వెళతారో వాళ్లందరూ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ థియేట్రికల్ ట్రైలర్ ని చూడొచ్చని వర్మ వ్యాఖ్యానించారు.

Prev 'సూర్యకాంతం' నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
Next బాలీవుడ్‌లో తెలుగు దర్శకుల వార్‌
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.