'మహానాయకుడు' విడుదల తేదీ ఖరారు

Article

ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగంగా రూపొందిన 'కథానాయకుడు' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఇక రెండవ భాగంగా 'మహానాయకుడు' నిర్మితమైంది. ఈ సినిమాను ఫిబ్రవరి 7వ తేదీనే విడుదల చేయవలసి వుంది. అయితే కొన్ని కారణాల వలన వాయిదా వేశారు.

ఫిబ్రవరి 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయవచ్చనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అదే తేదీని ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రధానంగా 'మహానాయకుడు' కొనసాగనుంది. 'కథానాయకుడు' సినిమా విడుదల సమయంలో .. వయసు మళ్లిన ఎన్టీఆర్ పాత్రకి బాలకృష్ణ బాగా సెట్ అయ్యారని చెప్పుకున్నారు. 'మహానాయకుడు' సినిమాలో ఆయన దాదాపు అదే లుక్ తో కనిపించనున్నారు. అందువలన సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. నందమూరి అభిమానులను ఈ సినిమా ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి మరి.

Prev ఈ నెల 14న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ విడుదల చేస్తున్నా: వర్మ
Next బాలీవుడ్‌లో తెలుగు దర్శకుల వార్‌
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.