'ప్రేమ క‌థా చిత్ర‌మ్2' ట్రైల‌ర్ విడుద‌ల‌

హ‌ర‌ర్, థ్రిల్ల‌ర్‌, కామెడీ అంశాల‌తో టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2. 2003 మే 11న విడుద‌లైన ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ కి సీక్వెల్‌గా ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో ఈ మూవీ రూపొందుతుంది. ఆర్. సుదర్శన్ రెడ్డి ‘ప్రేమ కథా చిత్రం 2’ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'బ్యాక్ టూ ఫియర్' అనేది క్యాప్షన్. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో నందిత శ్వేత క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథగా ప్రేమ క‌థా చిత్రం2 రూపొందుతుంది. సీనియర్ కెమెరామెన్ సి.రాం ప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి, డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్‌గా ఈ సినిమాకి ప‌ని చేస్తున్నారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగిస్తున్నాయి. హ‌ర‌ర్‌తో పాటు కామెడీ మంచి వినోదం అందిస్తుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. తాజాగా విడుదలైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

Prev మెగాస్టార్ సినిమాలో ఓ కీలక పాత్రలో శృతి హాసన్!!
Next తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలివారం వసూళ్లు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.