కేజీఎఫ్2‌లో రమ్యకృష్ణ, సంజయ్ దత్

Article

కన్నడ రాక్‌స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. రిలీజైన ప్రతీచోట భారీ వసూళ్లను సాధిస్తుండగానే కేజీఎఫ్‌కు సీక్వెల్‌ను నిర్మాత విజయ్ కిరంగన్‌దుర్ ప్రకటించేశారు. కేజీఎఫ్2 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సంజయ్ దత్ లాంటి నటుల పేర్లు వినిపించడంతో సినీ వర్గాల్లో విస్తృతమైన చర్చలు మొదలయ్యాయి.

మాటల్లో చెప్పలేం రమ్యకృష్ణ రోల్ ఏంటంటే కేజీఎఫ్2 చిత్రంలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రలో నటించేందుకు ఒకే చెప్పినట్టు కన్నడ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంలో భారత రాష్ట్రపతి రిమికా సేన్ పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తారనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బాహుబలిలో శివగామి పాత్రతో దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన రమ్యకృష్ణ పాత్రలో కనిపిస్తారనే అంశంతో భారీగా అంచనాలు పెరిగాయి. కేజీఎఫ్2 చిత్రంలో సంజయ్ దత్ కేజీఎఫ్2 చిత్రంలో బలమైన పాత్రలను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. అలాంటి బలమైన పాత్రల్లో సంజయ్ దత్ కూడా నటిస్తున్నట్టు తెలిసింది. అథిరా, ఇనాయత్ ఖాన్ కాకుండా మరో కొత్త క్యారెక్టర్‌లో సంజయ్ దత్ కనిపిస్తారనే మాట వైరల్‌గా మారింది. రెండోభాగంలో సంజయ్ దత్ క్యారెక్టర్ ఏమై ఉంటుందనే చర్చనీయాంశమైంది.

దుబాయ్ మాఫియాతో కేజీఎఫ్ చిత్రంలో గరుడను మట్టుబెట్టిన తర్వాత రాకీ భాయ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారుతాడు. ఇక గోల్డ్ స్మగ్లింగ్‌లో కీలక సూత్రధారి, దుబాయ్ డాన్ ఇనాయత్ ఖలీల్‌ ఆటకట్టించడం ఇక రెండో భాగంలో ఉంటుందట. దుబాయ్ మాఫియాతో యష్ చేసే ఎదురుదాడుల ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు

Prev అనారోగ్యం పాలైన రేణుదేశాయ్!
Next ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు లైన్ క్లియర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.