'ఆర్ ఆర్ ఆర్' మూవీలో అలియా భట్ రెమ్యూనరేషన్

Article

రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ గా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. దాదాపు 350 .. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా అలియా భట్ ను ఎంపిక చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. దాంతో ఈ సినిమా కోసం ఆమె ఎంత పారితోషికాన్ని అందుకోనుందనేది ఆసక్తికరంగా మారింది.

'రాజీ' సినిమా హిట్ తరువాత అలియా భట్ తన పారితోషికాన్ని 10 కోట్లకి చేర్చిందట. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను 'ఆర్ ఆర్ ఆర్' సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది గనుక, పారితోషికంగా ఆమె 15 కోట్లను డిమాండ్ చేసినట్టుగా సమాచారం. ఆ తరువాత జరిగిన బేరసారాల కారణంగా ఆమెకి 12నుంచి 15 కోట్ల లోపు పారితోషికం అందనుందని చెప్పుకుంటున్నారు. 2020 జూలై 30వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Prev 'సిరివెన్నెల' నుంచి ఫస్టులుక్
Next తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలివారం వసూళ్లు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.