రాజమౌళి సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్

Article

'బాహుబలి' సీరీస్ తర్వాత దర్శకుడు రాజమౌళి చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రారంభం నుంచీ వార్తల్లో నిలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్, చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారనగానే చిత్రానికి పెద్ద హైప్ వచ్చింది. ఇప్పుడీ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా నటించనున్నారనే వార్త తాజాగా ప్రచారంలోకి రావడంతో చిత్రానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. అజయ్ ఇందులో ఓ అతిథి పాత్రలో కనిపిస్తాడని, పాత్ర చిన్నదే అయినా, అది అందరికీ గుర్తుండి పోతుందనీ అంటున్నారు.

గతంలో రాజమౌళి తన 'ఈగ' చిత్రాన్ని హిందీలో అనువదించినప్పుడు ఆ సినిమాకి అజయ్ దేవగణ్ వాయిస్ ఓవర్ చెప్పారు. అప్పటి నుంచీ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, ఆ కారణంగానే ఇందులో గెస్ట్ రోల్ చేయడానికి అజయ్ ముందుకు వచ్చాడని సమాచారం. కాగా, ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల పేర్లు మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Prev లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన అనుష్క
Next ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా రానా మూవీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.