చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బయోపిక్ని చూసి ఏమన్నారంటే...

Article

విజయవాడ: సీఎం చంద్రబాబు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాను తిలకించారు. దర్శకుడు క్రిష్, నటులు బాలకృష్ణ, నారా రోహిత్, మంత్రి దేవినేని ఉమ, పలువురు టీడీపీ నేతలలో కలిసి నగరంలోని క్యాపిటల్ థియేటర్‌లో ఆయన సినిమాను చూశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ‘‘‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చాలా బాగుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ చాలా బాగా నటించారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్.’’ అని అన్నారు.

Prev మంచి కథ సిద్ధం చేసిన డైరెక్టర్ నరేంద్ర...ప్రధాన పాత్రలో కీర్తిసురేష్
Next మిస్టర్‌ మజ్ను ప్రీ రిలీజ్‌ కు చీఫ్ గెస్ట్ గా Jr.ఎన్టీఆర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.