'ఎఫ్ 2' టాక్ అదిరింది..

Article

సంక్రాంతికి సినిమాల సందడి మొదలైంది. ఇప్పటికే ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’, ‘పేట’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలు థియేటర్లలోకి దిగిపోయాయి. ఈ లిస్ట్‌లో ఉన్న మరో చిత్రం ‘ఎఫ్ 2’. ఈరోజు (శనివారం) విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన టాక్‌ను సొంతం చేసుకున్నట్లుగా తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ తన ట్విట్టర్‌లో తెలిపారు. విక్టరీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరో‌హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ‘ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌’ హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన చిత్రమిది.

శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెర‌కెక్కిన ఈ ఫ‌న్ రైడర్‌కు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్‌‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ‘విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న సందర్భంగా చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌ అకౌంట్‌లో మరో బ్లాక్‌బస్టర్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Prev ఊహించలేదు.. వీడియో చూసి ఏడ్చా: రష్మిక
Next ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు లైన్ క్లియర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.