మసూద్‌ అజర్‌ ఆస్తులను సీజ్‌ చేస్తున్నట్లు ఫ్రాన్స్‌ ప్రకటన

Article
పారిస్‌: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మరణించడం, ఈదాడి తమ పనే అని జేషే మహ్మద్‌ ప్రకటించడంతో మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మసూద్‌ అజర్‌పై చర్యలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశమైన ఫ్రాన్స్‌ అతని ఆస్తులను సీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చిన మూడు దేశాల్లో ఫ్రాన్స్‌ కూడా ఒకటి అయితే చివరి నిమిషంలో చైనా మరోసారి ఈ ప్రతిపాదనను అడ్డుకున్న సంగతి తెలిసిందే.దీంతో ఇతర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. ఇప్పుడు ఫ్రాన్స్ ఆ పని మొదలుపెట్టింది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులతో యురోపియన్ యూనియన్ ప్రత్యేకంగా ఓ జాబితాను నిర్వహిస్తోంది. ఆ జాబితాలో మసూద్ పేరును చేర్చే అంశంపై చర్చిస్తామని ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.
Prev 'ఆర్ ఆర్ ఆర్' మూవీలో అలియా భట్ రెమ్యూనరేషన్
Next తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలివారం వసూళ్లు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.