గూఢచారి రివ్యూ

Article

గూఢచారి రివ్యూ : నటీనటులు : అడవి శేష్ , శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ సంగీతం : శ్రీ చరణ్ నిర్మాణం : అభిషేక్ పిక్చర్స్ దర్శకత్వం : శశికిరణ్ తిక్క రేటింగ్ : 3/5 రిలీజ్ డేట్ : 3 ఆగస్టు 2018 అడవి శేష్ కథా రచన అందించడమే కాకుండా హీరోగా నటించిన చిత్రం ” గూఢచారి ”. ఎన్ ఐ ఏ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ : టెర్రరిస్టుల ఎటాక్ లో తండ్రి చనిపోయినప్పటికీ , దేశానికి సేవ చేయాలనే తలంపుతో నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ గా చేరాలనుకుంటాడు అర్జున్ ( అడవి శేష్ ) . అతికష్టం మీద త్రినేత్ర జాతీయ నేర సంస్థలో చేరతాడు . అందులో చేరాకా తన తండ్రి ని గురించిన అసలు నిజాలు తెలుస్తాయి అర్జున్ కు . అసలు అర్జున్ కు తండ్రి గురించి తెలిసిన నిజాలు ఏంటి ? అవి ఎందుకు మరుగున పడ్డాయి ,వాటిని అర్జున్ ఎలా చేధించాడు ? చివరకు తన ప్రతిభ ని ఎలా నిరూపించుకున్నాడు అన్నది తెలియాలంటే సినిమా చూడలసిందే .

హైలెట్స్ : ట్విస్ట్ లు ఇంటర్వెల్ బ్లాక్ స్క్రీన్ ప్లే డ్రా బ్యాక్స్ : సెకండాఫ్ లో కొన్ని సీన్స్ నటీనటుల ప్రతిభ : రా ఏజెంట్ పాత్రలో అడవి శేష్ నటన భేష్ అనిపించింది . మేనరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు అడవి శేష్ . శోభిత ధూళిపాళ గ్లామర్ తో అలరించడమే కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంది . ప్రకాష్ రాజ్ తన పాత్రకు న్యాయం చేసాడు ఇక మధుశాలిని , వెన్నెల కిషోర్ తదితరులు తమతమ పాత్రలతో ఆకట్టుకున్నారు .

ఓవరాల్ గా : అడవి శేష్ ని ముందుగా అభినందించాలి , తెలుగు చిత్రాలు మూస ధోరణి లోంచి బయట పడుతున్న ఈ సమయంలో రా నేపథ్యంలో సాగే ఈ సినిమా విభిన్న కథా చిత్రాలు కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది . అయితే ఫస్టాఫ్ ని బాగానే రాసుకున్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి కొన్ని సన్నివేశాలు డ్ర్ బ్యాక్ అయ్యాయి అలాగే తండ్రి కొడుకుల అనుబంధాన్ని కూడా అంతగా ఆవిష్కరించే ప్రయత్నం చేయలేదు . అడవి శేష్ స్క్రిప్ట్ కి శశికిరణ్ తిక్క చక్కగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేసాడు . అయితే మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే తప్పకుండా ఇంకా బాగుండేది .

Prev ‘సభకు నమస్కారం’ ఫై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
Next రీమేక్ క్వీన్ గా సమంత!!
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.