'ఇస్మార్ట్‌ శంకర్‌' కోసం హీరో రామ్‌ హార్డ్‌ ట్రైనింగ్‌

Article
హీరో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'ఇస్మార్ట్‌ శంకర్‌'. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పూరీ ఛార్మీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌ బాడీ మొత్తాన్ని మార్చేసుకుంటున్నాడు. ఈ పాత్రకు తగ్గట్టు హార్డ్‌గా తయారువుతున్నాడు. దీనిలో భాగంగా రేయింబళ్లు శ్రమిస్తున్నాడట. సమయం దొరికినప్పుడల్లా జిమ్‌లోనే ఉంటున్నాడట. ఈ పాత్ర కోసం ఆయన ఎలా తయారయ్యాడో తెలియజేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ ఫొటోలను బట్టి ఇప్పటికే ఆ క్యారెక్టర్‌కు తగ్గట్టు సిద్ధమైపోయినట్టు అర్థమైపోతుంది. ఇందులో నిధి అగర్వాల్‌, నభా నటేశా కథానాయికలుగా చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.
Prev మహేశ్ బాబు అభిమానుల కోసం ఆసక్తికరమైన కాంటెస్ట్
Next తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలివారం వసూళ్లు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.