మహేశ్ బాబు అభిమానుల కోసం ఆసక్తికరమైన కాంటెస్ట్

Article

దేశవ్యాప్తంగా మహేశ్ బాబుకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. మహేశ్ బాబును అమితంగా అభిమానించేవారికి ఆయనతో సెల్ఫీ తీసుకునే అవకాశం వచ్చింది. ఆయన బొమ్మను అద్భుతంగా గీస్తే చాలు .. ఆయన పక్కనే నుంచుని ఎంచక్కా ఒక సెల్ఫీ తీసుకోవచ్చు .. అదీ ఆయన సొంత థియేటర్ అయిన 'ఏఎమ్ బీ సినిమాస్'లో.

మహేశ్ బాబు మైనపు విగ్రహం త్వరలో సింగపూర్ లోని 'మేడమ్ టుస్సాడ్స్'లో కొలువుదీరబోతోంది. మహేశ్ బాబు మైనపు బొమ్మను అక్కడికి తీసుకెళ్లడానికి ముందు, 'ఏఎమ్ బీ సినిమాస్'లో ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా మహేశ్ అభిమానుల కోసం 'మేడమ్ టుస్సాడ్స్'వారు ఒక కాంటెస్ట్ ను నిర్వహించనున్నారు.

మహేశ్ బాబు స్కెచ్ ను గీసి .. ఈ నెల 21వ తేదీలోగా, 'మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్' అఫీషియల్ ఫేస్ బుక్ .. ట్విట్టర్ .. ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయవలసి వుంటుంది. ఈ కాంటెస్టులో విజేతలుగా నిలిచే ఇద్దరికీ, మహేశ్ బాబు మైనపు విగ్రహ ఆవిష్కరణ సమయంలో ఆయనతో కలిసి సెల్ఫీ తీసుకునే ఛాన్స్ దొరుకుతుంది.

Prev 'చిత్రలహరి' టీమ్ కి ధన్యవాదాలు తెలిపిన సాయిధరమ్ తేజ్
Next ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు లైన్ క్లియర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.