భయపెడుతున్న ‘జెస్సీ’ ఫస్ట్ లుక్

Article

హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి టాలీవుడ్‌లో హారర్ జానర్‌లో చాలా చిత్రాలు వచ్చాయి. అయితే ఎన్ని చిత్రాలు వచ్చినా హారర్ చిత్రాలకు సెలెక్టెడ్ ఆడియన్స్ ఉండటంతో భయపెట్టేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. తాజాగా అశ్విని కుమార్.వి అనే నూతన దర్శకుడు ‘జెస్సీ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.

బిగ్ బాస్ ఫేమ్ అర్చన, అతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, ఆషిమా న‌ర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `జెస్సీ`. ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై వి.అశ్విని కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ్వేతా సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా పూర్తి చేసి ‘జెస్సీ’ చిత్రాన్ని మార్చి మొద‌టి వారంలో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత శ్వేతా సింగ్‌.

Prev రాజమౌళి సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్
Next 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.