కల్యాణ్ రామ్ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

Article

ల్యాణ్ రామ్ కథానాయకుడిగా గుహన్ దర్శకత్వంలో '118' సినిమా రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కల్యాణ్ రామ్ - షాలినీ పాండే కాంబినేషన్లోని ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు.

"చందమామే చేతికందే .. వెన్నెలేమో మబ్బులోనే .., పూల చెట్టే కళ్లముందే .. పూవులేమో కొమ్మపైనే .., చూస్తూనే ఎంతసేపు .. తాకితేనే ఏంటి తప్పు .. పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా .. " అంటూ ఈ సాంగ్ సాగుతోంది. శేఖర్ చంద్ర సంగీతం .. రామాంజనేయులు సాహిత్యం .. యాజిన్ నిజర్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.

Prev వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత పెళ్లి ముహూర్తం ఫిక్స్
Next ‘కాంచన-3’ రివ్యూ అండ్ రేటింగ్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.