మహేష్, నమ్రత పెళ్లిరోజు.. 650 మంది అంధ బాలలకు విందు

Article

సినిమాలతో బిజీగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. భార్య నమ్రతా శిరోద్కర్ సారథ్యంలో ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు. వీరిద్దరూ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నారు. అనాథ పిల్లల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గచ్చిబౌలిలో ప్రారంభించిన ఏఎంబీ సినిమాస్‌లో అనాథ పిల్లల కోసం మొన్నామధ్య ‘స్పైడర్ మ్యాన్’ సినిమాను ప్రదర్శించారు. నమ్రత స్వయంగా దగ్గరుండి విడుదలకు ఒక్క రోజు ముందే ఈ చిత్రాన్ని అనాథ పిల్లలకు చూపించారు. ఇప్పుడు తమ పెళ్లిరోజు సందర్భంగా మహేష్, నమ్రత దంపతులు అంధ బాలలకు ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు.

మహేష్ బాబు, నమ్రత ఆదివారం తమ 14వ పెళ్లిరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా 650 మంది అంధ బాలలకు ఈ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. బేగంపేటలోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ విద్యార్థులకు మహేష్ బాబు టీం ఈ విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బాలలంతా మహేష్, నమ్రత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమకు ఒకపూట అన్నదానం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

సాధారణంగా సెలబ్రిటీల పుట్టినరోజు, పెళ్లిరోజు సెలబ్రేషన్స్ అంటే ఫారన్ టూర్లు, రిసార్టుల్లో ఎంజాయ్‌మెంట్లు, హాలీడే టూర్లు ఉంటాయి. బంధుమిత్రులు, సన్నిహితులతో పార్టీలు ఉంటాయి. కానీ, మహేష్-నమ్రత దంపతులు అలా కాదు. సరదాలకు, పార్టీలకు ఎప్పుడూ దూరంగా ఉండే అనాథ, అంధ బాలలను కనీసం ఈరోజైనా సంతోష పెట్టాలనే ఆలోచన. అందుకే తమ పెళ్లిరోజు నాడు 650 మంది బాలలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. మంచి మనసుతో తమ వంతు సేవ చేస్తోన్న మహేష్ - నమ్రత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు మరింత ఆనందమయం అవ్వాలని కోరుకుందాం.

Prev నా సినిమాకు ప్రధాని పబ్లిసిటీ : ఆర్జీవీ
Next 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.