మహేశ్ బాబుపై ప్రశంసల జల్లు కురిపించిన ఉప రాష్ట్రపతి

Article

తాను 'మహర్షి' సినిమాను కుటుంబ సభ్యులతో కలసి చూశానని, సినిమా అద్భుతంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కితాబిచ్చారు. ఈ సినిమాలో మహేశ్ బాబు నటన ఎంతో సహజంగా ఉందని అన్నారు. మహేశ్ చక్కని నటన కనబరిచారని ప్రశంసించారు. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను ఈ సినిమా గుర్తుకు తెచ్చిందన్నారు. ఈ మేరకు తన అధికార ట్విట్టర్ ఖాతాలో రెండు ట్వీట్లు పెట్టారు.

"గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం ‘మహర్షి’. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.

అంతకుముందు, "కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా" అని అన్నారు.

Prev 'పటాస్' షోకి గుడ్ బాయ్ చెప్పిన శ్రీముఖి
Next న‌రేంద్ర‌మోదీ చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.