నా సినిమాకు ప్రధాని పబ్లిసిటీ : ఆర్జీవీ

Article

నిత్యం వివాదాలతో సావాసం చేస్తూ.. ఆయన తీసే సినిమాలకు తనదైన శైలిలో పబ్లిసిటీ కల్పిస్తూ ఉంటాడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆర్జీవీ ప్రస్తుతం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే తన సినిమాకు స్వయంగా ప్రధాని నరేంద్రమోదీనే పబ్లిసిటీ కల్పిస్తున్నాడు అంటూ ట్వీట్‌ చేశారు.

నేడు (ఆదివారం) గుంటూరులో జరుగుతున్న సభలో నరేంద్రమోదీ ప్రసంగిస్తూ.. పార్టీలు ఫిరాయించడంలో, కొత్త కొత్త కూటములు కట్టడంలో, మామాగారిని వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ఎదగడంలో చంద్రబాబు తనకంటే సీనియర్‌ అని అన్న వీడియోను పోస్ట్‌చేశాడు. ఒక్కొక్క సాంగ్‌ను విడుదల చేస్తూ.. తన స్టైల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను ప్రమోట్‌ చేస్తున్నాడు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించారు.


Prev మహేష్ ఆనంద్ మృతి.. తాగుడే చంపేసిందా?
Next 'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.