మూవీ రివ్యూ: 'మిస్టర్ మజ్ను'

Article
 • చిత్రం : 'మిస్టర్ మజ్ను'
 • నటీనటులు: అక్కినేని అఖిల్ - నిధి అగర్వాల్ - రావు రమేష్ - నాగబాబు - ప్రియదర్శి - పవిత్ర లోకేష్ - సితార - హైపర్ ఆది - సుబ్బరాజు - సత్యకృష్ణ - విద్యు - రాజా తదితరులు
 • సంగీతం: తమన్
 • ఛాయాగ్రహణం: జార్జ్.సి.విలియమ్స్
 • నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
 • రచన - దర్శకత్వం: వెంకీ అట్లూరి
రేటింగ్-2.5/5

తొలి సినిమా ‘అఖిల్’.. మలి సినిమా ‘హలో’ తీవ్ర నిరాశకు గురి చేయడంతో మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’ మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు అక్కినేని అఖిల్. ‘తొలిప్రేమ’తో విజ‌యాన్ని అందుకున్న యువ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు కావ‌డం... ప్ర‌చార చిత్రాల్లో అఖిల్ సంద‌డి ఆక‌ట్టుకోవ‌డంతో ‘మిస్ట‌ర్ మ‌జ్ను’పై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి చిత్రం ఎలా ఉంది? తెలుసుకుందాం ప‌దండి...

కథ: విక్కీ (అక్కినేని అఖిల్) ఒక ప్లేబాయ్. ఏ అమ్మాయిని చూసినా నిమిషాల్లో పడేస్తాడు. కొన్ని రోజులు ఆ అమ్మాయితో రొమాన్స్ చేసి విడిపోతాడు. ఇలా పదుల సంఖ్యలో అమ్మాయిలతో ప్రేమాయాణం నడిపిన అతడికి.. తనకు కాబోయే వాడు రాముడై ఉండాలని ఆశించే నిక్కీ (నిధి అగర్వాల్) పరిచయం అవుతుంది. ముందు విక్కీని అసహ్యించుకున్న నిక్కీ.. తర్వాత అతడి వ్యక్తిత్వం నచ్చి ప్రేమిస్తుంది. విక్కీ కూడా నిక్కీని ప్రేమించడానికి అంగీకరిస్తాడు కానీ.. తర్వాత ఆమె తీరు అతడికి నచ్చదు. అది అర్థం చేసుకుని విక్కీకి దూరం అవుతుంది నిక్కీ. ఐతే ఆమె దూరమయ్యాకే విక్కీకి ప్రేమ విలువేంటో తెలుస్తుంది. ఈ స్థితిలో అతను మళ్లీ నిక్కీకి దగ్గర కావడానికి ఏం చేశాడు అన్నది మిగతా కథ.

విశ్లేష‌ణ‌ : తొలిప్రేమ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. అఖిల్‌ కోసం రొటీన్‌ లవ్‌ స్టోరినే తీసుకున్నాడు. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ రెండో ప్రయత్నంలో వెంకీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్మెంట్‌, ఎమోషనల్‌ సీన్స్‌తో బాగానే నడిపించినా.. సెకండ్‌ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథనం కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. రచయితగా మాత్రం వెంకీ తన మార్క్‌ చూపించాడు. చాలా డైలాగ్స్‌ గుర్తుండిపోయేలా ఉన్నాయి. జార్జ్‌ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్. హీరో హీరోయిన్లతో పాటు లండన్‌ అందాలను కూడా చాలా బాగా చూపించాడు. తమన్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

న‌టీన‌టులు: అఖిల్ కాస‌నోవాగా ఆక‌ట్టుకునేలా న‌టించాడు. కానీ భావోద్వేగాలు పండించాల్సిన సన్నివేశాల్లో హావ‌భావాల ప‌రంగా ఆయ‌న మ‌రింత రాటుదేలాల్సిన అవ‌స‌రం ఉంద‌నిపిస్తుంది. డ్యాన్సుల ప‌రంగా అఖిల్ మ‌రోసారి త‌న ప్ర‌తిభ‌ని చూపెట్టాడు. నిధి అగ‌ర్వాల్ క‌థానాయ‌కుడితో స‌మానంగా తెర‌పై క‌నిపిస్తుంది. ఆమె అందం, అభిన‌యం ప‌రంగా ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. ప్రియ‌ద‌ర్శి, విద్యుల్లేఖ రామ‌న్‌, సుబ్బ‌రాజు, హైప‌ర్ ఆది త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌వ్వించారు. రావు ర‌మేష్‌, జ‌య‌ప్ర‌కాష్‌, నాగ‌బాబు, ప‌విత్ర లోకేష్‌, సితారతో పాటు ప‌లువురు క్యారెక్ట‌ర్ న‌టులు తెర‌పై క‌నిపిస్తారు. కానీ వారి పాత్ర‌ల‌కి ప్రాధాన్యం తక్కువే. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. త‌మన్ సంగీతం బాగుంది. జార్జ్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ఇత‌ర అన్ని విభాగాలు కూడా ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ల‌కి త‌గ్గ‌ట్టుగా ప‌నిచేశాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి తొలి సినిమా ‘తొలిప్రేమ’ త‌ర‌హాలోనే మ‌రోసారి ప్రేమ‌క‌థ‌ని ఎంచుకొని ఈ సినిమా చేశాడు. అయితే ర‌చ‌న ప‌రంగా, క‌థ ప‌రంగా తొలి సినిమా త‌ర‌హా మేజిక్ ఇందులో క‌నిపించ‌దు.


చివరగా: మిస్టర్ మజ్ను.. డోస్ సరిపోలేదు!

  ప్లస్‌ పాయింట్స్‌ :
 • అఖిల్‌
 • సినిమాటోగ్రఫి
  మైనస్‌ పాయింట్స్‌ :
 • రొటీన్‌ స్టోరి
 • సెకండ్‌ హాఫ్
Prev స‌ల్మాన్ ఖాన్ 'భార‌త్' టీజ‌ర్ విడుద‌ల‌
Next ‘కాంచన-3’ రివ్యూ అండ్ రేటింగ్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
  Please submit your comments.