యన్.టి.ఆర్.. కథానాయకుడు మూవీ రివ్యూ

Article
 • చిత్రం ఎన్టీఆర్‌-కథానాయకుడు
 • స‌మ‌ర్ప‌ణ‌: సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి
 • నిర్మాణ సంస్థ‌లు: ఎన్‌.బి.కె.ఫిలింస్, వారాహి చ‌ల‌న చిత్రం, విబ్రి
 • నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, మంజిమా మోహన్‌, నరేష్‌, మురళీశర్మ, క్రిష్‌, రవికిషన్‌, శుభలేఖ సుధాకర్‌, రవిప్రకాష్‌, చంద్ర సిద్ధార్థ, భానుచందర్‌, ప్రకాష్‌రాజ్‌, కె.ప్రకాష్‌, ఎన్‌.శంకర్‌, దేవి ప్రసాద్‌ తదితరులు
 • సంగీతం: ఎం.ఎం.కీరవాణి
 • నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
 • దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
 • రేటింగ్: 3.25/5

బయోపిక్‌లు అంటేనే జయాపజాయాలకు సంబంధం ఉండదు. చరిత్ర ఆధారంగా తీసే సినిమాలు చరిత్రను సృష్టిస్తాయి. అలాంటి కోవలోకే చేరుతుంది ‘యన్.టి.ఆర్’. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అంతటి మహానుభావుడి చరిత్రను సినిమాగా మలచడం సాహసంతో కూడుకున్న పనే. కానీ, ఆయన కుమారుడు ఈ సినిమాను తెలుగు ప్రజలకు అందించాలనుకునే మొదటి విజయం సాధించేశారు. అలాగే గొప్ప వ్యక్తుల జీవితాలను తెరకెక్కించేటప్పుడు సున్నితమైన అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. ‘యన్.టి.ఆర్’ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి భాగమైన ‘యన్.టి.ఆర్.. కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా బుధవారం విడుదలైంది. మరి ఇందులో బాలయ్య.. తన తండ్రి పాత్రను ఎలా పోషించాడు..? ఎన్టీఆర్ జీవితం ఎలా సాగింది..? ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది..?

క‌థ: ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్త‌కం. దాని గురించి అభిమానుల‌కు, తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌నిది ఏమీ లేదు. ఎన్టీఆర్ సినీ నేప‌థ్యం గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే, ఆయ‌న కుటుంబానికి ఎంత విలువ ఇస్తారు. ముఖ్యంగా బ‌స‌వ‌తార‌క‌మ్మ‌కు ఆయ‌న ఎంత ప్రాధాన్యం ఇస్తార‌న్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు. ఆ విశేషాల‌న్నీ య‌న్‌.టి.ఆర్‌: క‌థానాయ‌కుడులో చూస్తాం. ఒక ర‌కంగా ఇది ఎన్టీఆర్ క‌థ అన‌డం క‌న్నా బ‌స‌వ‌తార‌కం క‌థ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె కోణంలో నుంచి ఈ క‌థ మొద‌లైంది. ఆ కోణంలోనే ఈ క‌థ సాగుతుంది. బ‌స‌వ‌తార‌కం(విద్యాబాల‌న్‌) క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ ఉంటుంది. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి గురించి హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్‌రామ్‌) తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతూ క‌నిపించ‌డంతో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. అప్పుడు చికిత్స తీసుకుంటున్న బ‌స‌వ‌తార‌కం ఎన్టీఆర్ ఆల్బ‌మ్‌ను తిర‌గేస్తూ ఉండ‌టంతో య‌న్‌.టి.ఆర్‌. అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఎన్టీఆర్(బాల‌కృష్ణ‌) ఎలా ఎదిగారు? సినిమాల‌పై వ్యామోహం ఎందుకు పెరిగింది? సినిమాల్లో ఎలా రాణించాడు? ఒక సాధార‌ణ రైతు బిడ్డ గొప్ప స్టార్‌గా ఒక్కో అడుగు వేసుకుంటూ ఎలా వెళ్లాడన్న‌ది క‌థ‌. ఎన్టీఆర్ ప్ర‌స్థానంతో మొద‌లైన చిత్రం.. ఎన్టీఆర్ తెలుగుదేశం ప్ర‌క‌ట‌న‌తో ముగుస్తుంది. మ‌రి తండ్రి పాత్ర‌లో బాల‌కృష్ణ ఎలా మెప్పించారు. బ‌స‌వ‌తార‌కంగా విద్యాబాల‌న్ ఎలాంటి న‌ట‌న క‌న‌బ‌రిచింది. తెలుగువారి అభిమాన న‌టుడు ఎన్టీఆర్ సినీ జీవితం ఎలా సాగిందో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే!

నటీనటల పనితీరు
ఎన్టీఆర్‌గా బాల‌కృష్ణ‌ కనిపించిన తీరు అద్భుతమనే చెప్పాలి. తన తండ్రి పాత్రలో లీనమైపోయి బాలయ్య కనబరిచిన నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది. విభిన్న గెటప్‌లలో కనిపించినా అన్నింటికీ సెట్ అయ్యాడనే అనిపిస్తుంది. అయితే, యుక్త వయసులోని ఎన్టీఆర్‌ను చూపించిన సమయంలో మాత్రం సెట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక, ఈ సినిమాలో మరో గొప్ప పాత్ర అంటే విద్యాబాలన్‌దే. బసవతారకం పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించారు. ఈ పాత్రకు ప్రాణం పోశారు. ఈ పాత్ర త‌ర్వాత అభిమానుల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకునేది అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్రే. ఆయన పాత్రలో సుమంత్.. గత సినిమాల్లో కనబరచని నటనను చూపించాడు. అక్కినేని పాత్ర కూడా సినిమాలో చాలా సేపు ఉంటుంది. ఇక మిగిలిన నటులు తమ పరిధి మేర చక్కగా నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
అసలు ఈ సినిమాకు ఒప్పుకోవడమే దర్శకుడు క్రిష్ చేసిన పెద్ద సాహసం. సున్నితమైన అంశాలను చూపించే క్రమంలో అతడు చక్కని పనితీరును కనబరిచాడు. అభిమానులకు కావాల్సిన కోణాన్ని ఆవిష్కరిస్తూనే అన్ని వర్గాలనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను ప్లస్ అయ్యాయి. అలాగే సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. జ్ఞాన శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ప్ర‌తి ఫ్రేమూ చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.

  బలాలు
 • * ఎన్టీఆర్‌-బ‌స‌వ‌తార‌కం సన్నివేశాలు
 • * ఎన్టీఆర్‌-ఏయ‌న్నార్‌ల మైత్రి
 • * విద్యాబాలన్ అభినయం
 • * భావోద్వేగ సన్నివేశాలు
 • * డైలాగ్స్
 • * బ్యాగ్రౌండ్ స్కోర్
  బలహీనతలు
 • * ఫస్టాఫ్ సాగదీత, నిడివి
 • * ఎన్టీఆర్ యంగ్ ఏజ్‌లో బాలయ్య కనిపించిన తీరు
నట విశ్వ విఖ్యాత స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారిని ఈ చిత్రంతో మరోసారి అభిమానుల గుండెల్లో మేలుకొలిపారని చెప్పొచ్చు. నందమూరి హీరో అభిమానులకైతే ఈ చిత్రం పండగే. కాబట్టి ఎన్టీఆర్ - కథానాయకుడు ఈ సంక్రాంతి కి చూడవలసిన చిత్రం .
Prev మరో అరుదైన రికార్డు సాధించిన సింబా మూవీ
Next న‌రేంద్ర‌మోదీ చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
  Please submit your comments.