'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు మరోసారి షాక్ ఇచ్చిన హైకోర్టు

'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు మరోసారి షాక్ ఇచ్చిన హైకోర్టు
ఏపీ మినహా మిగిలిన ప్రాంతాల్లో విడుదలైన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఓ వర్గానికి సంబంధించిన అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలపై ఈ చిత్రం ప్రభావం చూపిస్తుందని కొందరు కోర్టును ఆశ్రయించడంతో... ఇంత వరకు ఏపీలో ఈ చిత్రం విడుదల కాలేదు. పోలింగ్ మరుసటి రోజైన 12వ తేదీన (రేపు) చిత్రాన్ని ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్న సినిమా దర్శకనిర్మాతలకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఈరోజు ఈ చిత్రాన్ని ఏపీ హైకోర్టు ఛాంబర్ లో జడ్జిల కోసం ప్రదర్శించారు. సినిమాను చూసిన తర్వాత... తీర్పును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో దర్శకనిర్మాతలు నిరాశకు గురయ్యారు.
more updates »