పేట మూవీ రివ్యూ

Article

న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, సిమ్ర‌న్‌, త్రిష‌, విజ‌య సేతుప‌తి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, యోగిబాబు త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ సుబ్బ‌రాజు
సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌
నిర్మాత‌: క‌ళానిధి మార‌న్‌, అశోక్ వ‌ల్ల‌భ‌నేని

ఎల్ల‌లులేని అభిమానుల‌ను సొంతం చేసుకున్న ఘ‌న‌త సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ది. త‌న‌దైన‌ స్టైల్‌, మేన‌రిజంతో క‌ట్టిప‌డేస్తారు. ఆయ‌న సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తారు. త‌మిళ‌నాడులో అయితే అక్క‌డి వారికి త‌లైవా సినిమా ఒక పెద్ద పండ‌గ‌లాంటిదే. తెలుగులోనూ ర‌జ‌నీకి అభిమానులు త‌క్కువేం కాదు. అందుకే ఆయ‌న న‌టించిన ప్ర‌తి సినిమా ఏక‌కాలంలో తెలుగులోనూ విడుద‌ల‌వుతుంది. ఈ సంక్రాంతికి కూడా త‌న‌దైన స్టైల్‌, మేన‌రిజ‌మ్స్ అల‌రించేందుకు పేట‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. మ‌రి గ‌తేడాది 2.0తో అల‌రించిన ర‌జ‌నీ కొత్త ఏడాదిలో ఎలా మెప్పించారు? యువ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు త‌న అభిమాన హీరోని తెర‌పై ఎలా ప్రెజెంట్ చేశాడు? విజ‌య సేతుప‌తి, న‌వాజుద్దీన్ సిద్ధిఖీల న‌ట‌న ఎలా ఉంది?

కథ‌ :
కాళీ (రజనీకాంత్‌) ఓ హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తుంటాడు. అక్కడే ప్రాణిక్‌ హీలర్‌గా పనిచేసే డాక్టర్‌(సిమ్రన్‌)తో కాళీకి పరిచయం అవుతుంది. అంతా సరదాగా గడిచిపోతున్న సమయంలో కాళీకి లోకల్‌ గూండాతో గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా కాళీ అసలు పేరు పేట అని, అతను ఉత్తరప్రదేశ్‌ నుంచి అక్కడకు వచ్చాడని తెలుస్తోంది. అసలు పేట, కాళీగా ఎందుకు మారాడు..? సింహాచలం(నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ)కు, పేటకు మధ్య గొడవ ఏంటి.? పేట తిరిగి ఉత్తరప్రదేశ్ వెళ్లాడా.. లేదా..? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు :
ర‌జ‌నీకాంత్‌కు ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌. త‌న‌లోని న‌టుడిని స‌వాల్ చేసే స‌న్నివేశం ఈ చిత్రంలో ఒక్క‌టి కూడా క‌నిపించ‌దు. చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. కుర్రాడిలా ర‌జ‌నీకాంత్ ఇచ్చే హావ‌భావాలు కాస్త ఎంట‌ర్‌టైన్ చేస్తాయి. ఈ వ‌య‌సులోనూ అంత జోరుగా న‌టించ‌డం కేవ‌లం ర‌జ‌నీ వ‌ల్ల మాత్ర‌మే అవుతుంది. న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ‌సేతుప‌తిలాంటి న‌టుల‌కు ఈ క‌థ‌లో చోటిచ్చాడు ద‌ర్శ‌కుడు. కానీ, వాళ్ల స్థాయికి త‌గ్గ‌ట్టు ఆ పాత్ర‌ల‌ను తీర్చిదిద్ద‌లేదేమోన‌నిపిస్తుంది. వారిద్ద‌రూ ఇటీవ‌ల కాలంలో చేసిన అత్యంత బ‌ల‌హీన‌మైన పాత్ర‌లు ఇవి. సిమ్ర‌న్‌, త్రిష‌ల‌తో ర‌జ‌నీకాంత్ న‌డిపిన ల‌వ్ ట్రాక్ సినిమాకు కాస్త ఉప‌శ‌మ‌నం. అయితే, వారివి ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లేమీ కాదు.

విశ్లేష‌ణ‌ :
పేట పక్కా కమర్షియల్‌ ఫార్ములాతో తెరకెక్కిన సినిమా హీరో వేరే ప్రాంతంలో తన ఐడెంటినీ దాచి బతుకుతుండటం. ఓ భారీ యాక్షన్‌ ఫ్లాష్ బ్యాక్‌ ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్‌ లో చాలా సినిమాలు వచ్చాయి. రజనీ కూడా గతంలో ఇలాంటి సినిమాలు చేశాడు. అయితే మరోసారి అదే ఫార్ములాకు రజనీ స్టైల్‌ను జోడించి తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌. తొలి భాగానికి ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌లతో నడిపించిన కార్తీక్‌, ద్వితియార్థంలో కాస్త తడబడ్డాడు. రజనీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకున్న కథలో పెద్దగా కొత్తదనమేమీ లేదు. పూర్తిగా తమిళ నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించటం కూడా తెలుగు ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. అనిరుధ్ అందించిన పాటలు తమిళ ప్రేక్షకులను అలరించినా తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకోవటం కష్టమే. నేపథ్య సంగీతం మాత్రం సూపర్బ్‌ అనిపిస్తుంది. తిరు సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

 • ర‌జ‌నీ స్టైల్‌
 • ప్ర‌థ‌మార్థంలో కొన్ని స‌న్నివేశాలు
 • సిమ్ర‌న్‌-ర‌జ‌నీల ట్రాక్‌
 • మైనస్‌ పాయింట్స్‌ :

 • క‌థా, క‌థ‌నం
 • ద్వితీయార్ధం
 • తమిళ నేటివిటి
 • Prev నేనేంటో ప్రేక్షకులకు చూపిస్తా అంటున్న: కాజోల్
  Next రెమ్యునరేషన్ పెంచేసిన కృతిసనన్
   

  0 Comments

  Write a comment ...
  Post comment
  Cancel
   Please submit your comments.