ప్ర‌భాస్, మ‌హేష్‌ల‌ని డైరెక్ట్ చేయ‌నున్న కేజీఎఫ్ డైరెక్ట‌ర్‌

ప్ర‌భాస్, మ‌హేష్‌ల‌ని డైరెక్ట్ చేయ‌నున్న కేజీఎఫ్ డైరెక్ట‌ర్‌
డిసెంబరు 21,2018న చ‌డీ చ‌ప్పుడు లేకుండా విడుద‌లై బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రం కేజీఎఫ్‌. క‌ర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ద‌ర్శకుడు ప్ర‌శాంత్ నీల్‌. యువ నటుడు యష్‌ ఈ చిత్రంలో హీరోగా నటించారు. తెలుగు, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రం రీసెంట్‌గా వంద రోజుల ర‌న్ పూర్తి చేసుకుంది. అయితే కేజీఎఫ్ చిత్రంతో అంద‌రి దృష్టిని ఆకర్షించిన ప్ర‌శాంత్ నీల్ టాలీవుడ్ టాప్ హీరోస్‌తో విడి విడి ప్రాజెక్టులు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో హీరోగా ప్రభాస్ .. దిల్ రాజు బ్యానర్లో హీరోగా మహేశ్ బాబుల‌తో ప్ర‌శాంత్ నీల్ సినిమా చేయ‌నున్నార‌ని అంటున్నారు. మ‌రి ఈ ప్రాజెక్టులపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం కేజీఎఫ్ సీక్వెల్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని శ‌ర‌వేగంగా చిత్రీక‌రించి 2020లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌ని తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర‌ కూడా ఇందులో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
more updates »