'సిరివెన్నెల' నుంచి ఫస్టులుక్

Article

తెలుగు తెరపై నిన్నటి తరం కథానాయికగా ప్రియమణికి మంచి పేరుంది. 'చారులత' .. 'క్షేత్రం' వంటి సినిమాలు ప్రియమణి నటనకు అద్దం పడతాయి. నాయిక

ప్రాధాన్యత కలిగిన చిత్రాలను సైతం ప్రియమణి అలవోకగా చేయగలదనే నమ్మకాన్ని కలిగించాయి. అలాంటి ప్రియమణి ప్రధాన పాత్రధారిగా 'సిరివెన్నెల' రూపొందుతోంది.

ప్రకాశ్ పులిజాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, చిన్నప్పటి ప్రియమణిగా బేబీ సాయితేజస్వి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఈ చిన్నారి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలానే ఈ ఫస్టులుక్ వుంది. 'మహానటి' సినిమాలో చిన్నప్పటి సావిత్రిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నారి, ఈ సినిమాలో వైవిధ్యభరితమైన నటనను ప్రదర్శించనుంది. ఈ పాత్ర ఈ చిన్నారికి మరింత గుర్తింపును తీసుకురావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prev ‘మజిలీ’ నుంచి న్యూ స్టిల్స్...సైకిల్ తొక్కుతున్న నాగచైతన్య
Next తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలివారం వసూళ్లు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.