ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్

ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్

ప్రస్తుతం రజనీకాంత్ .. మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా 'దర్బార్' అనే టైటిల్ ను ఖరారు చేసుకుని, సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా తరువాత రజనీ ఇక తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వచ్చింది. కానీ అందుకు భిన్నంగా ఆయన మరో ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

రజనీతో ఒక్క సినిమా చేసినా చాలు .. ఇక ఆయన రాజకీయాలవైపు వెళ్లిపోతారు అనే ఉద్దేశంతో, ఆయనకి చాలామంది కథలను వినిపించారట. ఆ దర్శకులలో కేఎస్ రవికుమార్ .. వినోత్ లకు మాత్రమే రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ ఇద్దరూ వినిపించిన కథలు విభిన్నంగా ఉండటం .. ఆ పాత్రలు తాను ఇంతవరకూ చేసినవి కాకపోవడం వలన రజనీ వెంటనే ఓకే చెప్పేశారట. ఇక ఈ రెండు సినిమాల తరువాత మాత్రం ఆయన సినిమాలు చేసే అవకాశాలు తక్కువేననే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.

more updates »