మహేష్‌ని సీతారామరాజులా చూడాలని అనుకోవడం లేదు: రాజమౌళి

Article

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో రాజమౌళి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కథ గురించి, చిత్ర టైటిల్‌ గురించి, హీరోయిన్ల గురించి క్లారిటీ ఇచ్చిన జక్కన్న.. ఈ సినిమాపై మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ చేస్తున్నాడు. కృష్ణగారు చేసిన ఆ పాత్రను మహేష్‌బాబును పెట్టి మీరే సినిమా చేస్తానని చెప్పారు కదా..! ఇప్పుడు రామ్ చరణ్‌తో అంటే విభేదాలు రావంటారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు రాజమౌళి.

‘ఆ మధ్య ఓ ఫంక్షన్‌లో మహేష్ బాబుతో ఎలాంటి సినిమా కావాలి అని ఆయన అభిమానులను అడిగాను.. అల్లూరి సీతారామరాజు కావాలి? జేమ్స్‌బాండ్ కావాలా?.. అని అడిగితే అల్లూరి సీతారామరాజుకు చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది. జేమ్స్‌బాండ్ అనగానే అందరూ కేకలు పెట్టారు. కాబట్టి అల్లూరి సీతారామరాజులా మహేష్‌ని అభిమానులు చూడాలని అనుకోవడం లేదు. కాబట్టి ఈ సినిమాలో చరణ్ పాత్రకు ఎటువంటి విభేదాలు వ్యక్తం కావు’ అని జక్కన్న చాలా క్లారిటీగా సమాధానమిచ్చారు.

Prev 'ఓట‌ర్' టీజ‌ర్‌ రిలీజ్
Next వరుసగా 14 హిట్లు కొట్టిన బాలీవుడ్ హీరో
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.