'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ సరసన డైసీ

Article

'ఆర్ఆర్ఆర్' చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో కనిపించే ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ కనిపించనుందని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. ఇప్పటికే రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తోందని చెప్పిన ఆయన, సినిమాలో అలియా క్యారెక్టర్ చాలా ముఖ్యమైనదని, సినిమాను మలుపు తిప్పే పాత్రలో నటిస్తోందని వెల్లడించారు.

తాను ఏ సినిమాలో అయినా, కథ డిమాండ్ చేస్తే తప్ప బలమైన క్యారెక్టర్లలో హీరోయిన్లను తీసుకోనని, అందువల్ల ఈ సినిమాలో 'బాహుబలి'లో ఉన్నటువంటి బలమైన స్త్రీ పాత్రల్లో హీరోయిన్లను ఊహించుకోవద్దని అన్నారు. తనకు సంబంధించినంత వరకూ 'సీత' అనే పాత్రలో నటించే అలియా, సినిమాలో బలమైన మహిళ పాత్రని చెప్పారు. ప్రజలకు తెలిసిన అల్లూరి, భీమ్ లకు సంబంధించిన చిన్న వయసులో జరిగిన కథగా సినిమా ఉంటుంది కాబట్టి, ప్రజలు చూడని విధంగా వారి పాత్రలు, వేషధారణ ఉంటాయని రాజమౌళి స్పష్టం చేశారు.

Prev టీడీపీ డిమాండ్ చేసినట్టుగా సినిమా ఆగదు: రామ్ గోపాల్ వర్మ
Next వరుసగా 14 హిట్లు కొట్టిన బాలీవుడ్ హీరో
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.