ఊహించలేదు.. వీడియో చూసి ఏడ్చా: రష్మిక

Article

‘ఛలో’ సినిమాతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక. తర్వాత ‘గీత గోవిందం’లో కనిపించిన ఈ భామకు కుర్రకారులో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా రష్మిక ఇటీవల ‘జీ సినిమా’ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు రష్మిక కోసం ఓ ప్రత్యేకమైన వీడియోను రూపొందించారు. ‘గీత గోవిందం’ ఆడియో ఫంక్షన్‌ వీడియోను, ఓ ఇంటర్వ్యూ వీడియోను, సినిమాలో ఆమె స్టిల్స్‌ను కలిపి దీన్ని రూపొందించారు. ఈ వీడియోను రష్మిక ఫ్యాన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఆమెకు ట్యాగ్‌ చేశారు. దీన్ని చూసిన ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

‘నేను ఏ మాత్రం ఊహించలేదు. ఈ ఎడిట్‌ చూస్తున్నప్పుడు ఏడ్చేశాను. ఏం చేశానని ఇంత ప్రేమకు నేను అర్హురాలినో తెలియదు కానీ.. మీలా ప్రోత్సహించే వారు నా చుట్టూ ఉన్నందుకు గర్వంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. కన్నీరు ఆగట్లేదు. ఐ లవ్‌ యు సో మచ్‌ గాయ్స్‌’ అని రష్మిక ట్వీట్‌ చేశారు.

రష్మిక ‘దేవదాస్‌’ సినిమాతో గత ఏడాది సెప్టెంబరులో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తున్నారు. భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యశ్‌ రంగినేని నిర్మిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. మరోపక్క రష్మిక కన్నడలో రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

Prev వినయ విధేయ రామ సినిమాఫై స్వామిజీ కామెంట్స్
Next ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు లైన్ క్లియర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.