సల్మాన్ ఖాన్ సేఫ్ గేమ్..మరోసారి పాత ఫార్ములానే నమ్ముకున్నఖాన్

Article

ప్రస్తుతం సల్మాన్ ఖాన్....రీమేక్ స్టోరీస్‌ను చేయడం తగ్గించి ఒక్కప్పటి ఆయన సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ చేసే పనిలో పడ్డాడు. లాస్ట్ ఇయర్ ‘రేస్’ సిరీస్‌లో ‘రేస్3’ సీక్వెల్ చేసి బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాడు.

అంతకు ముందు సల్మాన్ ‘‘ఏక్ థా టైగర్’’ సినిమాకు సీక్వెల్‌గా ‘‘టైగర్ జిందా హై’’ తో మంచి హిట్ అందుకున్నాడు. లేటెస్ట్‌గా సల్లూ బాయి..ఆయన కెరీర్‌లో గొప్ప హిట్‌గా నిలిచిన ‘దబాంగ్’ సినిమాకి మూడో సీక్వెల్‌ను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఇయర్ ఏప్రిల్‌లో ఈ మూవీ సీక్వెల్ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం సల్మాన్..‘భారత్’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈసినిమాను ఈద్ కానుకగా విడుదల కానుంది.

ఆ తర్వాత ఏప్రిల్‌ నుంచి ‘దబాంగ్ 3’ సీక్వెల్ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాను ఈ ఇయర్ చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు షూటింగ్‌కు సంబంధించిన లొకేషన్స్ ఎంపిక పూర్తైయిన్నట్టు ఈచిత్ర నిర్మాత ఆర్బాజ్ ఖాన్ ప్రకటించారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కే ఈ సీక్వెల్‌లో సల్మాన్ సరసన మరోసారి సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తోంది.

మరోవైపు సల్మాన్ ఖాన్...సాజిద్ నడియావాల దర్శకత్వంలో ‘కిక్’ సినిమాకు సీక్వెల్‌గా ‘కిక్2’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకోవైపు సల్మాన్ ప్రభుదేవా దర్శకత్వంలో ‘వాంటెడ్’ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఏమైనా సల్మాన్ కొత్త కథలతో రిస్క్ చేయడం కన్నా...ఆల్రెడీ ప్రూవ్ అయిన కథలతోనే సీక్వెల్స్ చేసే పనిలో పడ్డాడు.

Prev రాజేంద్ర‌ప్రసాద్‌గారితో క‌లిసి పనిచేయ‌డం ఆనందంగా ఉంది:విక్టరీ వెంకటేశ్‌
Next ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు లైన్ క్లియర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.